У вашего броузера проблема в совместимости с HTML5
మేడారం జాతర పాట 2020 full song
===================
Lyrics & Producer: DCP
Music Director: Wilson
Singer: Vaishali
Choreography: Tamil Raj
Cameraman: Guru Babu
Direction: Rajesh Khanna
====================
Lyrics:
పల్లవి:
జాజులో జాజులు
మట్టి పూల గాజులు |2|
పసుపూ కుంకుమ బంగారం
మా అడవీ బిడ్డల సింగారం
జాజులో జాజులు...
మట్టి పూల గాజులు
*1*
చిలకల గుట్టలో పసుపై మొలిసిన
కుంకుమ భరినే సమ్మక్క తల్లి
జాజులో జాజులు...
మట్టి పూల గాజులు
కన్నెపల్లిలో ఎరుపై మెరిసిన
పసుపూ భరినే సారక్క తల్లి
జాజులో జాజులు...
మట్టి పూల గాజులు
పొనుకొండ|3|నుండి బయలుదేరిన సమ్మక్క పెనిమిటి పగిడిద్దరాజు
రాజులో రాజులు
మీరు వీర యోధులు|2|
బుట్టాయి|3|నుండి దూసుకొచ్చిన
సమ్మక్క కొడుకు గోవిందరాజులు
రాజులో రాజులు
మీరు వీర యోధులు|2|
*2*
మేడారం గద్దెపై పులి మీద కూసున్న
ఆదివాసి ఆడిబిడ్డ సమ్మక్క తల్లి
జాజులో జాజులు
మట్టి పూల గాజులు
కొండకోన చెట్టు గుట్ట పుట్టమీదున్న
మమ్మల్ని కాచే మా అడవి తల్లి
జాజులో జాజులు
మట్టి పూల గాజులు
జలజల|3|పారే జనమే వనమై
జలకాలాడే జంపన్న వాగులో
వాగులో వాగులో
పరవశాల జోగులో|2|
మిలమిల|3|లాడే మాఘ శుద్ధ పౌర్ణమిలో
గలగలలాడే సాగేటి వాగులో
వాగులో వాగులో
పరవశాల జోగులో|2|
*3*
యుద్ధ రంగాన మెరుపై మెరిసిన
మేడరాజు బిడ్డ సమ్మక్క తల్లి
జాజులో జాజులు
మట్టి పూల గాజులు
బతుకు పోరులో అలసిన జనులకు
ఆయువునిచ్చే బంగారు తల్లి
జాజులో జాజులు
మట్టి పూల గాజులు
నీకు ఒడినియ్యం|3| పోస్తం
మొక్కులప్పజెబుతం
నిలువెత్తు బంగారం నీకు అప్పజెపుతం
తల్లుల్లో తల్లులు
మా ఆడిబిడ్డలు
నువ్వు పులి మీద |3| కూసోని
మమ్మల్ని జూడు తల్లి
సల్లంగ దీవించి కాపాడు తల్లి
తల్లుల్లో తల్లులు
మా ఆడిబిడ్డలు
జాజులో జాజులు
మట్టి పూల గాజులు
పసుపు కుంకుమ బంగారం
మా అడవి బిడ్డల సింగారం