У вашего броузера проблема в совместимости с HTML5
ఛాన్సొస్తే మీరు ఏ హీరో/హీరోయిన్ తో డేట్ కి వెళతారు?..
ఈ రోజుల్లో.. యువతకి సినిమా హీరో, హీరోయిన్లంటే ఎంతో క్రేజు. డేటింగ్ కల్చర్ కూడా పాపులర్ అవుతున్న నేపథ్యంలో.. అవకాశమొస్తే మీరు ఏ సెలబ్రిటీతో డేట్ చేస్తారు అని.. 'తెలుగోడు ' యువతని అడిగింది. చాలా హుషారుగా అమ్మాయిలు, అబ్బాయిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సర్వేలో సమంత అబ్బాయిల కలల రాకుమారిగా తేలింది. ఎక్కువమంది అబ్బాయిలు ఆమెతో డేట్ చెయ్యాలని కలలు కంటున్నారు. ఇటు సన్నీలియోన్ కూడా కుర్రాళ్లని బాగానే వేడెక్కిస్తోందని వ్యక్తమైంది. సమంత, సన్నీలియోన్ తర్వాత కాజల్ అగర్వాల్, అలియా భట్, కత్రినా కైఫ్, ఇలియానాలపై కుర్రాళ్లు మనసుపడ్డారు.
ఇటు అమ్మాయిలు ఎక్కువమంది తమ కలలరాకుమారుడిగా బాహుబలి ప్రభాస్‌కి ఓటేసారు. ప్రిన్స్ మహేష్‌బాబుకి కూడా అమ్మాయిల్లో ఉన్న క్రేజు తక్కువేమీ కాదు. ఆ తర్వాత వరుసలో పవన్‌కళ్యాణ్, రణ్‌బీర్‌కపూర్‌లు నిలుచున్నారు.
కొందరు అమ్మాయిలు సరదాగా ఊహించి చెప్పడానికి కూడా నిరాకరించారు. మా నాన్న తిడతారని చెప్పారు. అమ్మాయిల పట్ల ఇంకా మన కుటుంబాల్లో వివక్ష కొనసాగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. అమ్మాయిలు మరింత స్వేచ్ఛగా.. తమదైన స్వంత వ్యక్తిత్వంతో ఎదిగేలా మన సమాజంలో మార్పు రావాలని ఆశిద్దాం!!.