17th State Level Drama Competitions Third Day at Ravindra Bharathi Drama Video 1
У вашего броузера проблема в совместимости с HTML5
17th State Level Drama Competitions Third Day see http://www.telugudrama.com, http://www.tollywoodsite.com at Ravindra Bharathi 17th State Level Drama Competitions Third Day at Ravindra Bharathi on 16th September 2011 రవీంద్రభారతిలో జరిగిన మూడవ రోజు 17వ రాష్ట్ర స్థాయి నాటక పోటీలు 2011 యువకళావాహిని, అక్కినేని నాగేశ్వరరావు నాటక పరిషత్తుల సంయుక్తాధ్వర్యంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా రవీంద్రభారతిలో జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా 17 వ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు -- 2011 నాటకాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మూడో రోజైన 16 సెప్టెంబర్ 2011న శ్రీ క్రియేషన్స్ గోవాడ సుగర్స్ ఆధ్వర్యంలో 'బొమ్మ సముద్రం', కళాభారతి ఆధ్వర్యంలో 'కాలుష్యం', ఉషోదయా కళానికేతన్ ఆధ్వర్యంలో 'గారడీ' నాటికలు ప్రదర్శించారు. 'బొమ్మ సముద్రం' నాటికకు ఉదయ్ భాగవతులు రచన, దర్శకత్వం వహించి పాత్రను అద్భుతంగా ప్రదర్శించారు. కళాభారతి వారి 'కాలుష్యం' నాటికకు రచన ఏ. భాస్కర చంద్ర , వై.జి. ప్రకాష్ దర్శకత్వం చేశారు. చెరుకూరి సాంబశివ రావు 'గారడీ' నాటికకు రచన, దర్శకత్వం అందించారు. అనంతరం కళాకారులకు బహుమతులను అందజేశారు.