యువకళావాహిని ఆధ్వర్యంలో రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, చలనచిత్ర దర్శకుడు 'విక్టరీ' మధుసూదనరావు సంస్మరణ కార్యక్రమం 21 జనవరి 2012న రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్ఞానపీఠ్ అవార్డుగ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు విచ్చేశారు. చలనచిత్ర రంగంలో మధుసూదనరావు గారు నిర్మించిన సినిమాలు నేటికి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని డా.సి.నారాయణరెడ్డి గారు అన్నారు. ఒకమంచి దర్శకుడిని చలనచిత్రరంగం కోల్పోయిందని రఘుపతివెంకయ్య అవార్డు గ్రహీత వి.బి.రాజేంద్రప్రసాద్ గారు అన్నారు.
ఈ కార్యక్రమానికి సినీదర్శకులు పి.చంద్రశేఖరరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ సినీనటుడు టి.చలపతిరావు, సినీనటి గీతాంజలి, ప్రముఖ సినీనటులు బి.వి.నారాయణ రావు, ఆహుతిప్రసాద్, శివా'రాజా, 'అభినవభారతాచార్య' డాక్టర్ చాట్ల శ్రీరాములు, ప్రముఖ సినీ నిర్మాత కె.ముఖర్జీ, కార్నేషన్ సిఇఓ డాక్టర్ రామ్.పి.జయప్రకాష్ రెడ్డి, యువకళావాహిని నిర్వాహకుడు వై.కె.నాగేశ్వర రావు తదితరులు హాజరైనారు.